UPDATES  

 ఎస్సై యుగంధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ, మార్కెట్ వైస్ చైర్మన్

వనపర్తి/పెద్దమందడి (తెలంగాణ వాణి)

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని నూతన ఎస్సై యుగంధర్ రెడ్డిని మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సదా అందుబాటులో ఉండి అమూల్యమైన సేవలు అందించాలని, పోలీస్ బృందానికి మండల ప్రజలు అందరం సహకరించాలన్నారు. వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు గట్టు యాదవ్, అల్వాల మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, మద్దిగట్ల మాజీ ఎంపీటీసీ సత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest