UPDATES  

 శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని

ధర్మారం ( తెలంగాణ వాణి విలేకరి)

కరీంనగర్ లో ప్రసిద్ధిగాంచిన ఇంటర్మీడియట్ విద్యాసంస్థల శ్రీ చైతన్య ఐఐటి- జేఈఈ, నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులలో ప్రతిభ వెలికి తీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన స్కాలర్ షిప్ టాలెంట్ టెస్ట్ 2025 కు గాను రికార్డ్ స్థాయిలో 12,519 మంది విద్యార్థులు నమోదు చేసుకొని హాజరయ్యారు. శ్రీ చైతన్య సంస్థలకు చెందిన పది కళాశాలలలో ఈ పరీక్షలను అత్యధిక నమోదు శాతంతో నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న జి వర్షిత మొదటి బహుమతిగా స్మార్ట్ ఎల్ఈడి టీవీ 30 వేల రూపాయల విలువైనది అందుకుంది. ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ టీవీ నీ బహుమతిగా అందుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్యల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి , శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ ఏజీఎం, ధర్మారం మండల కేంద్రానికి చెందిన మునిందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest