ఆర్టీసీ బంక్ ముందు అడ్డగోలు దందా
మేమేం చేయలేమంటున్న బంక్ నిర్వాహకులు
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
కొత్తగూడెం బస్టాండ్ పక్కనున్న ఆర్టీసీ బంక్ వద్ద కొంతమంది యువత వాహనాల శైనింగ్ కోసం అంటూ స్ప్రే అమ్మకాలు చేస్తున్నారు. 350 రూపాయల MRP ఉన్న బాటిల్ ఒక్కోక్కరికి ఒక్కో ధరకు అమ్ముతు మోసం చేస్తున్నారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్ కు వచ్చే వారి వాహనాలకు అడ్డం పడి మరీ ఇబ్బంది పెడుతు, మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు చేసేందుకు వీళ్ళకు ఎందుకు అనుమతించారాని పెట్రోల్ బంక్ నిర్వహకులను అడిగితె అది తమ పరిధి కాదని అక్కడ ఎవరు ఎం అమ్ముకున్న మాకు సంబంధం లేదని వాళ్ళు మోసం చేస్తున్నారని అనిపిస్తే వాళ్ళ ప్రోడక్ట్ కొనొద్దని ఉచిత ఇచ్చారు. వాళ్ళను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పామని అంతకు మించి మేమేం చేయలేముంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం…
Post Views: 102