UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యధావిధంగా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుండి తొలగించడం బాధాకరమని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అంతటి మహనీయుని పేరును తొలగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడని హరిజనుల దేవాలయాల ప్రవేశాలపై, సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను రూపు మాపటానికి తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు, అటువంటి మహనీయుని పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. సూరవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని అందులో ఎటువంటి సందేహం లేదని, నూతనంగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టి గౌరవించాలని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయ భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుగూరి నగేష్ కుమార్, కోశాధికారి చీమకుర్తి తాతా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ దారా యుగంధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెండ్యాల ప్రసాద్ రావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు దారా నగేష్, సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, దమ్మపేట మండల అధ్యక్షులు పసుమర్తి రామభద్రం, మండల అధ్యక్షులు ఉడత వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల అధ్యక్షులు వారణాసి సురేష్, మణుగూరు మండల అధ్యక్షులు చిత్తలూరి రమేష్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు తెల్లాకుల డైమండ్ రావుజిల్లా, బిక్కుమల్ల సుధాకర్ ,ఉపాధ్యక్షులు: తమ్మిశెట్టి రమేష్, కడివెండి విశ్వనాథ్ గుప్తా, ధారా నరసింహారావు, నరేంద్రుల హేమంత్ ,కంచర్ల రామారావు, పసుమర్తి శ్రీనివాస్, తల్లాడ ఉపేందర్, గునిపాటి సుధాకర్, సహాయ కార్యదర్శి: దాచేపల్లి పిచ్చయ్య, వెచ్చా శ్రీరాములు తల్లాడ సాయికుమార్, కోశాధికారి కొదమూరు భాను ప్రకాష్, సాత్విక్, బసవయ్య, వారణాసి బాబు, గణేష్, కొదుమూరి సురేష్, తమ్మిశెట్టి విజయ్, వందనపు వీరభద్రం, డాక్టర్ జి వి రావు, , తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest