ధర్మారం (తెలంగాణ వాణి ) మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వి అఖిల, బిశ్రీజ జాతీయస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్ 19 పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. వీరు డిసెంబర్ నెలలో మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ జట్టు కు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచల్ ప్రదేశ్ లో గుమార్విన్ లో జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటారని తెలిపారు. వీరి ఎంపిక పట్ల ప్రిన్సిపల్ వ్యాయామ ఉపాధ్యాయుడు బైకాని కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.
Post Views: 79

