జబ్బార్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క
ములుగు (తెలంగాణ వాణి)
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి చెందిన మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడుగా పని చేసి ఇటీవల మరణించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్) ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు గత 10 ఏళ్లుగా తన గెలుపోటముల సంబంధం లేకుండా నిత్యం తనకు అందుబాటులో ఉండి పని చేసిన జబ్బార్ అకాల మరణం చెందడం తనకు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి అండగా తామంత ఉంటామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 55