UPDATES  

NEWS

 ఇంటి పైకప్పు కూలి మహిళా మృతి

టేక్మాల్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి టేక్మాల్ గ్రామానికి చెందిన మంగలి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పురాతన గృహాలలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest