ధర్మారం (తెలంగాణ వాణి )
ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టు కథలు సృష్టించి మాజీ సిఏం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేస్తు రాజీవ్ రహదారి పై రాస్తా రోకో నిర్భహించారు. అనంతరం మాజీ సింగిల్ విండో చేర్మెన్ ముత్యాల బాలరామ్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ రాసురి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు తుమ్మల రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్టాన్ని సాధించిన కేసీఆర్ కు సిట్ విచారణ పేరిట నోటిసులు ఇవ్వడం సి ఏం రేవంత్ రెడ్డి నిరంకుసత్వానికి నిదర్శనమని ఒక్కసారి సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి కెసిఆర్ను మధురం చేసే పనిలో ఉన్నారని మల్లిపడ్డారు. రాబోయే కాలంలో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే రాష్ట్రం అగ్గిగుండంగా మారుతుందని తెలిపారు. కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తెలంగాణలో వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధును రాబందులు తన్నుకు పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలించును అత్యుత్సాహం వల్ల ఎస్టీలను మండల శాఖ అధ్యక్షుడు అద్మిర మల్లేశం కు స్వల్ప గాయాల అయినట్లు తెలిపారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏం సి చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు చొప్పరి చంద్రయ్య, మాజీ రైతుబంధు అధ్యక్షులు పాకాల రాజన్న, రామారావు,సర్పంచ్ సంకసాని సౌజన్య సతీష్ రెడ్డి, ఎండి రఫీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు దాడి సదయ్య, బెల్లాల రోజా లక్ష్మణ్, దేవి రమణ,ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, అనుబంధ శాఖ అధ్యక్షులు నళిని కాంత్,ఉప సర్పంచ్ లు భరత్ స్వామి, భైరి సురేష్,మాజీ సర్పంచ్ కె రాజయ్య, నాయకులు సి హెచ్ తిరుపతి, వార్డ్ సభ్యులు గాజుల రాజు, నార ప్రేమ్ సాగర్, సంధినేని కొమురయ్య, నాడేం శ్రీనివాస్, మిట్ట భరత్, సల్వాజి మాధవరావు, దేవి రాజేందర్, అజ్మీర శ్రీనివాస్, తిరుపతి నాయక్, బాలసాని లింగయ్య, గంధం తిరుపతి,రాగుల మల్లేశం, అంజాల శ్రీనివాస్, తాళ్ల రాజయ్య, ఎండి షరీఫ్, ఎండి అజాం, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

