UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

ఈ నెల 19 నుండి 20 వరకు 2 రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న కొత్తగూడెం క్రీడాకారులు 4 బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పతకాలతో సత్కరించి అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా మన జిల్లాకు మంచి పేరు తేవాలని అభినందనలు తెలిపారు. కొత్తగూడెం కు చెందిన ఏ వందన డిస్కస్ త్రో, హెపటాదిలిన్ లో రెండు బంగారు పథకాలు,

సిహెచ్.వేదశ్రీ కిడ్స్ జావలింగ్ త్రో ట్రయాత్లను లో రెండు బంగారు పతకాలు, జే.దీక్షిత్ షాట్ పుట్ లో బంగారు పతకాలు సాధించడం జరిగింది. పతకాలు సాధించిన క్రీడాకారులను, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ కే సారంగపాణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ మహిధర్, సిపిఐ పార్టీ చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జాతీయ క్రీడాకారులు చుంచుపల్లి మండలం సిపిఐ పార్టీ కౌన్సిల్ మెంబెర్ ఎండీ . బాబ్జి, కొత్తగూడెం అథ్లెటిక్స్ కోచ్ దుంపల మల్లికార్జునరావు, సుష్మ భాయ్, జాతీయ క్రీడాకారులు వంశీ, మాన్విత క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest