UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెరుకుపల్లి గ్రామంలో ఇటీవల విశాహారం తిని 62 గొర్రెలు మరణించిన విషయం విధితమే. బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మండలంలోని పెరికపల్లి గొర్రెల పెంపకం దారులను పరామర్శించి సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 62 గొర్రెలు మరణించగా మండల పశు వైద్యాధికారి వచ్చి చూసి ఎలాంటి మందులు అడిగిన ఇవ్వకుండా లేవని వెళ్లిపోయారని పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండల పశు వైద్యాధికారి కి, పెద్దపల్లి జిల్లా పశువైద్యాధికారితో మాజీమంత్రి ఫోన్ లో మాట్లాడుతూ త్వరగా చర్యలు తీసుకుని నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. ఆయన వెంట బారాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి, ఆవుల శ్రీనివాస్, అజ్మీర మల్లేశం నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest