ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాక వారి ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేగోళం రిషి మాట్లాడుతూ.. భారత స్వతంత్ర ఉద్యమంలో గిరిజనుల పోరాటాల స్థానం ఎంతో కీలకమైనదని ఆదివాసీల ఉత్కంఠ ప్రగతి కోసం చేసిన పోరాటాలు కొన్ని శతాబ్దాల కాలం గడిచిన అధికారిక చరిత్రలో చోటు పొందలేకపోయాయని అన్నారు. తెలంగాణలో కొమరం భీం జీవితం అతనితత్వం ఆయన నినాదం ఈ గిరిజనుల పోరాటానికి శాశ్వత చిహ్నం నిలిచిందని ఆయన మాటల్లో జల్,జంగిల్, జమీన్ అనే మాటలు గిరిజనుల హక్కుల స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. 1991 అక్టోబర్ 22న అదిలాబాద్ జిల్లా ప్రస్తుత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో గొండు తెగకు చెందిన తండ్రి కొమరం చిన్ను తల్లి సోంబాయి దంపతులకు కొమురం భీమ్ జన్మించాడని అతని బాల్యం పేదరిక సామాజిక అన్యాయంతో నిండిదనితన కుటుంబం ఇతర గిరిజనులు నిరంతర అణిచివేతకు గురవుతుండగా భీమ్ ఈ అసహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొనసాగాడు. నిజాం పాలనలో అడవి అధికారులు జమీందారులు గిరిజనులపై తీవ్ర పీడన కొనసాగించారని అధికారుల వలన తండ్రి మరణం భీమ మనసులో తిరుగుబాటు ఆవేశాన్ని రగిలించి అక్కడి నుండి ఆయన ప్రజా పోరాటం ప్రారంభమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బద్దం రవీందర్, అన్నాడ మైపాల్, వెంకటేష్, కొమురయ్య, ఎల్లయ్య, మహేందర్, వంశీ రెడ్డి, మధు చారి, శంకర్ కీర్తన్ యువశక్తి యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, నితిన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
