ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏ ఎం సి చైర్మన్ ఎల్ రుప్ల నాయక్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ 107 వజయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రూప్ల నాయక్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత అని కొనియాడారు. ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1965 వ సంవత్సరంలో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నరు. జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చి గరీబ్ హఠావో అను నినాదంతో ముందుకు వెళ్లారని ఆమెను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు కాంపల్లి రాజేశం, ఈదుల శ్రీనివాస్, గంధం మహిపాల్, అలువాల రాజేశం, శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, వడ్లకొండ అంజయ్య, జనగామ తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు ఓరెమ్ చిరంజీవి, ఉత్తం రాజయ్య తో పాటు హమాలీలు పాల్గొన్నారు.


