UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 ఇంటి పట్టాలు పంపిణీ సంగతి చూడండి : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

జీ.ఓ.నెం 76 అన్ లైన్ ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీఓ 76 ప్రవేశ పెట్టగా సుమారు 2 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని దరఖాస్తుతో పాటు డబ్బులు కూడా కట్టారని ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే పట్టాల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారని ఎన్నికలు జరిగి 10 నెలలు దాటినా నేటికీ పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభికపోవడంతో ఇల్లులు కొనుగోలు, అమ్మకాలు జరగక ప్రజలు ఆర్దికంగా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest