ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ప్రక్కన గత కొంతకాలంగా వైన్ షాప్ నిర్వహించడం వలన ఆ చుట్టుపక్కల ఇండ్ల లో నివాసం ఉంటున్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇక్కడి వైన్ షాప్ ను జనవాసులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అక్కడి ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, దూడ లచ్చయ్య, రాజ మల్లయ్య, తో పాటు మరికొందరు గురువారం ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో వారి గోడు వెళ్ళబోసుకున్నారు. మద్యం ప్రియులు పోద్దంత, రాత్రంతా వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగులో మద్యం త్రాగుతూ మూత్రం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఏర్పడి దుర్వాసనతో అనేక రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని వైన్ షాప్ కు సమీపంలో గాంధీ విగ్రహంతో పాటు చర్చి ఉండడం చేత అక్కడికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. వైన్ షాప్ చుట్టూరా మద్యం సీసాలు గ్లాసులతో నిండిపోవడం విచ్చలవిడిగా మూత్రం చేస్తూ మహిళలకు అసౌకర్యంగా మారినందున నూతనంగా వచ్చే మద్యం షాపును జనవాసులకు దూరంగా ఉంచాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ కు, పెద్దపల్లి ఎక్స్చేంజ్ అధికారులకు, పెద్దపల్లి ఆర్డీఓ కు, ధర్మారం తహశీల్దార్ కు దరఖాస్తులు చేశామని తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.


