UPDATES  

NEWS

 గ్యాదరి కిషోర్ చిత్రపటం దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద గ్యాదరి కిషోర్ చిత్రపటాన్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల ఓట్లతో గెలిచి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడిన గ్యాదరి కిషోర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే తగు పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘం చైర్మన్ చొప్పదండి మల్లేశం, కొక్కులరామ్ నారాయణ, గ్రామ యూత్ అధ్యక్షులు మేకల కుమార్, నాయకులు మీనుగు స్వామి, మీనుగు రమేష్, నిరువట్ల మల్లేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest