UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిఫాంల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందని పాత దుస్తులతో విద్యార్థులు కాలం వెళ్ళదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు యూనిఫాం లను కుట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, షూస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే అందించి వారిని ఆదుకోవాలని మల్లేశం కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest