UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 బాలెబోయిన రాజు మృతి

నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మండలంలోని తెలగ రామవరం గ్రామానికి చెందిన బాలెబోయిన రాజు మరణించారు. విషయం తెలుసుకున్న తూము చౌదరి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, మృతుని కుటుంబాన్ని పరామర్శించి, అండగ ఉంటామని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును కొందరు క్షణికావేశంలో తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే గడ్డి మందును బ్యాన్ చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం శ్రీనివాస్, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండి గౌస్ పాషా, బలరాం నాయక్, యాసరపు నరసింహారావు, గుండ్ల రవి, మాచర్ల శ్రీను, వెంగళరావు, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest