UPDATES  

NEWS

 మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి మాట్లాడుతూ మంత్రిని హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నిన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 51 వేల పైచిలుకు ఓట్లతో ఓడించినా నీకు సిగ్గు లేదు, నీ నీచమైన బూతు మాటలు మానుకోవాలి ,నీవు ఒక ఇసుక దొంగవి మంత్రిని విమర్శించే నైతిక విలువలు లేవానీ నీవు వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను ఈ రాష్ట్రంలో తిరగనియ్యం నిన్ను బొంద పెడతామని హెచ్చరించారు. నీ పార్టీ లో దొంగల గురించి దోపిడి దారుల గురించి మాట్లాడు, లాభాలలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నీ పార్టీ నాయకులు నీచులు వారి గురించి మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు నీతి నిజాయితీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు పై లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా ధనాన్ని దోచుకొని లక్ష కోట్లు తిన్న మీ మాజీ ముఖ్యమంత్రిని తిట్ట మనీ ఘాటుగా విమర్శించారు. దోపిడి దారులు ఎవరో మోసగాళ్ళు ఎవరో గాడిద కిషోర్ నీ కళ్లు మనస్సు తెరిచి చూడు, కబర్దర్ బిడ్డ మా మంత్రిని ఇకపై ఏమైనా అంటే నీ నాలుక చీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ లు కాంపల్లి రాజేశం, జనగాం తిరుపతి, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు ఏదుళ్ల అంజయ్య, నాయకులు దూడ తిరుపతి, కాల్వల సతీష్ కుమార్, ఇరుగురాల మహేష్, చొప్పదండి మల్లేశం, కాంపెల్లి పోచయ్య, నేరువట్ల మల్లయ్య, బెక్కెం అశోక్, కొత్తూరు మల్లేష్, జేరిపోతుల శ్రీకాంత్, బెక్కెం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest