UPDATES  

 ధర్మారం సంపూర్ణంగా బంద్

బందులో పాల్గొన్న కాంగ్రెస్, బిఆర్ఎస్, భాజపా నాయకులు

ధర్మారం (తెలంగాణ వాణి) బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బందుకు బీసీ ఐకాస ఇచ్చిన పిలుపుమేరకు ధర్మారం మండల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా కు చేరుకుని వ్యాపార వాణిజ్య ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను హోటళ్లను బందు చేయించారు. మూడు పార్టీల నాయకులు బైకులపై పెద్ద ఎత్తున ధర్మారం అంత కలియ తిరుగుతూ నిరసన ప్రదర్శన చేశారు, అనంతరం మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మూడు పార్టీల నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం మూడు పార్టీల నాయకులు అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేసి మానవాహారంగా ఏర్పడి నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం వివిధ పార్టీల ప్రధాన నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు ఉందక వెనకబడి పోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బారాస, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest