ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నెరువట్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, నాయకులు కాంపల్లి పోచయ్య, నెరువట్ల మల్లయ్య, చొప్పదండి మల్లేశం. ఇటీవల ఎమ్మార్పీఎస్ మండల శాఖ కన్వీనర్,కో కన్వీనర్ గా నియామకమైన ఇరుగురాల మహేష్, చొప్పదండి అభిలాష్ లను మంత్రి శాలువాతో సన్మానించారు.
Post Views: 670




