UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 చిన్నారి వైద్యానికి చేయూత

మరోసారి మానవత్వం చాటుకున్న పొంగులేటి క్యాంప్ శ్రేణులు

 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతు కొత్తగూడెంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ శ్రేణులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం నాగారం కాలనీ చెందిన కేసోజు కృష్ణమాచారి రేవతి దంపతుల కుమార్తె జ్ఞాన్విక తీవ్ర అనారోగ్యం పాలై శ్వాసకి సంబంధించిన ఇబ్బంది ఎదురవడటంతో చిన్నారి చికిత్సకు రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం పాల్వంచ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు యూత్ కాంగ్రెస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చీకటి కార్తీక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన అధ్యక్షులు జోగు ప్రదీప్ మరికొందరు కలిసి తక్షణ సహాయంగా 30వేలు అందించి, త్వరలోనే వీలైనంత ఎక్కువ ఆర్థికసాయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కసనబోయిన రామ్మూర్తి, నరేందర్, నాగారం ఉపసర్పంచ్ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest