ఇంటి పట్టాలు పంపిణీ సంగతి చూడండి : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) జీ.ఓ.నెం 76 అన్ లైన్ ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీఓ 76 ప్రవేశ […]
ప్రజల మనిషి పౌరహక్కుల యోధుడు బాలగోపాల్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) అక్టోబర్ 8 నేడే పౌరహక్కుల యోధుడు బాలగోపాల్ 15వ వర్ధంతి. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రజల కనీస హక్కుల సాధనకై పోరాడిన ప్రొఫెసర్ కే బాలగోపాల్ ఆశయాలు సజీవంగా మన మధ్యనే ఉన్నాయి. రైతు కూలీలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పోరాటాల్లో పాల్గొనడమే ఈ దేశంలో నేరమైంది. ప్రజల పౌర హక్కులు కాలరాయబడిన వేళ తన ఊక్కుపిడికిలి పైకిత్తి రాజ్య హింస సాగదని గుండెలెదురొడ్డి పోరాడిన యోధుడు […]
అటవీ ప్రాంతలోని గండ్రబంధం గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ మండలంలోని కిన్నెరసాని అటవీ ప్రాంతంలో గల రహదారి కూడా లేని గడ్రబంధం గ్రామాన్ని ట్రాక్టర్ కొంత కాలినడకన ద్వారా గ్రామాన్ని చేరుకొని ఇటీవలే స్వర్గస్తులైన సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ తాటి రాధమ్మ భర్త తాటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కలుగజేసి తాటి వెంకటేశ్వర్లు చిత్ర పటానికి పూలమాల వేసి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా నివాళులర్పించారు. అదే […]
కార్యకర్తను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్

సుజాతనగర్ (తెలంగాణ వాణి) సుజాతనగర్ మండలం 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీలో తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్ తమ్ముడు అన్వర్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తమ్మీశెట్టి అశోక్, బొమ్మిడి రమాకాంత్, ప్రభాకర్, ఫజల్, అన్వర్ […]
బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శీలం లక్ష్మణ్ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం అవార్డు అందుకున్నారు. రాష్ట్ర బెస్ట్ సిటిజన్ పోలీస్ గా 5వ ర్యాంక్ రావడం అది రామగుండం కమిషనరెట్ పరిధిలోని ధర్మారం మండలానికి రావడం చాలా సంతోషకారమని స్తానికులు అన్నారు. ఎస్సై లక్ష్మణ్ కు అవార్డు రావడం పట్ల స్థానిక నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.
రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఈ నెల 19 నుండి 20 వరకు 2 రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న కొత్తగూడెం క్రీడాకారులు 4 బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పతకాలతో సత్కరించి అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా మన జిల్లాకు మంచి పేరు తేవాలని అభినందనలు తెలిపారు. కొత్తగూడెం కు చెందిన ఏ వందన డిస్కస్ త్రో, హెపటాదిలిన్ లో రెండు బంగారు పథకాలు, […]
టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా

గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్) స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు […]
యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ

కోట్లు నొక్కేసి కుంటి సాకులు చెబుతున్నారంటు బాధితుల ఆవేదన ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులు, యువతే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి […]
ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటం తెలంగాణ తల్లిని అవమానించడమేనని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కకాంతారావు సూచనలతో రేవంత్ ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి […]
హరీష్ రావు బృందాన్ని విడుదల చేసిన కేశంపేట పోలీసులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి బ్యూరో) గత మూడు గంటలుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరుల అరెస్టు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. మంత్రి హరీష్ రావు తదితర బృందాన్ని కెశంపేట పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో హరీష్ రావు తదితరులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ […]