అదుపులోకి తీసుకున్న నలుగురు ఆదివాసీలను విడుదల చేయాలి

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ కరీంనగర్ (తెలంగాణ వాణి) టేకమెట్ల గ్రామాన్ని చుట్టుముట్టి మయాంద్ర సోధి, సోడి రాజ్ కుమార్, దేవా బార్సే, ఉర్ర కుంజమ్ నలుగురిని అరెస్టు చేసి ఉసూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు తెలిపారు. నలుగురు ఆదివాసీలను పోలీసు బలగాలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా మహిళలు, […]
సీనియర్లను సిఎం నిర్లక్ష్యం చేస్తుండ్రు

నీకో దండం… నీ పార్టీకో దండం పార్టీ పిరాయింపుదారులే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తుండ్రూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు జగిత్యాల (తెలంగాణ వాణి) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు..నీకో దండం..నీ పార్టీకో దండం..పార్టీ పిరాయింపుదారులే హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తుం డ్రని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సొంత కాంగ్రెస్ పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు […]
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య

జగిత్యాల (తెలంగాణ వాణి) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణకు గురయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి మారు గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కావలసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడుగా భావించే జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కాగా ఒక్కసారి […]
ఒక్కసారిగా పెరిగిన గోదావరి వరద ఉధృతి

గోదావరిలో చిక్కుకున్న ఇసుక కార్మికులు కొట్టుకుపోయిన ట్రాక్టర్లు జగిత్యాల/మల్లాపూర్:అక్టోబర్ 21(తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఒక్కసారిగా గోదావరికి వరద ఉదృతికి ట్రాక్టర్ లో ఇసుక నింపుతున్న కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరి వరద నీరు ఎక్కువ రావడంతో నదిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ వదిలేసిన డ్రైవర్ లేబర్ తో కలిసి ఒడ్డుకు చేరాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో గోదావరి నీటి ఉదృతి […]
రేపటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి

కొత్తగూడెం (తెలంగాణ వాణి) రేపు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కొట్టి వెంకటేశ్వర రావు తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా […]
ఈటెల రాజేందర్ కొత్తగూడెం పర్యటన వాయిదాకు కారణమేంటి

జిల్లా నాయకుల మధ్య విభేదాలా ? అగ్రకుల నాయకుల రాజీనామా బెదిరింపులా ? కొత్తగూడెం (తెలంగాణ వాణి) అగ్రకులాల బెదిరింపులతో బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీ గొంతు మూగబోయిందా. ఇప్పుడు ఇదే విషయం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చర్చనియాంశంగా మారింది. బీజేపీ జిల్లా పార్టీలో ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు పోవడం ఖాయమన్న సంగతి కూడ మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ గొంతుక, జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, మల్కాజ్గిరి […]
బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామానికి చెందిన నక్క బీమమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలలో చికిత్స చేపించుకున్న క్యాన్సర్ వ్యాధి నయం కాకపోవడంతో మనస్థాపం చెందిన నక్క భీమమ్మ దసరా రోజు సాయంత్రం 6 […]
భద్రాద్రి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

చేయని తప్పుకు బలి పశువును చేశారు అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన బూర్గంపహాడ్ (తెలంగాణ వాణి) గతంలో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన జిల్లా పోలీస్ యంత్రాంగంలో కలకలం రేపింది. బూర్గంపహాడ్ ఎస్సై, బిఆర్ఎస్ నాయకుడు, ఏఎస్సై లు చేసిన పనికి తనని బలి పశువు చేసారని, చేయని తప్పుకు పడ్డ నింద తట్టుకోలేకపోతున్నానని, భార్య, తండ్రికి సెల్ఫీ వీడియో పంపి పురుగుల మందు తాగిన కానిస్టేబుల్ సాగర్. భద్రాద్రి కొత్తగూడెం […]
మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు. నక్సలైట్లతో చేతులు కలిపి […]
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఆణువణువూ దేశభక్తి నింపుకున్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణ వార్త దేశ ప్రముఖులనే కాక సామాన్య ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో […]