ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మంగళ వారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పాల్వంచ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లిక్కి విశ్రుత్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, పాల్వంచ […]
రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ.
మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన పాల్వంచ వాసి టి.నవ్య శ్రీ.468/470 మాకు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసింది. ఈ సందర్భంగా పాల్వంచలోని తమ నివాస కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నారు.ఈ సందర్భంగా వెంకట రమణ వేణు దంపతులు,ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్న,జిల్లా అధ్యక్షులు బాలునాయక్,టి.శ్రీనివాస్ తదితరులు అభినందన తెలిపారు
జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో సీఎం కప్ లో విజయం సాధించి హైదరాబాదులో ఎస్ జి ఎఫ్ ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బి అక్షయ, సి అక్షర, ఎ అక్షయ, మామునూరి శ్రమజా సంపత్, కె కిజీయాబీ, ప్రశాంత్, బి రామ్ చరణ్, సి అభ్యాస్, కే ధీరజ్ […]
ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్.
భద్రాద్రి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు..కొత్తగూడెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ..ఈ నోట్ పుస్తకాలు వేసవి సెలవులను ఆనందంగా గడపడానికి మరియు వ్రాత నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగ పడుతుందని అన్నారు.
బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్
ఇల్లందు మండలంలోని చెన్నంగలగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం బి.నామానాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.
గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు.
అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన తో పాటు కేక్ కట్ చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్.ఈ యొక్క కార్యక్రమములో సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోని విద్యార్థులు ఇప్పటి నుండి శ్రమిస్తే ఉన్నత పదవుల తో పాటు సమాజములో మంచి గౌరవము లభిస్తుందని సూచించారు.ఈ కార్యక్రములో పాల్గొన్న విద్యార్థులకు జనరల్ నాలెడ్జి పుస్తకాలు అందించినందుకు గాను పాఠశాల విద్యార్థులు మధుకర్ […]
మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపంగా లక్ష్మీ దేవి పల్లి లో గల అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి ప్రేమికులు పతాంజలి యోగ గురువు పట్టాభి రామారావు,హరినాథ్ ప్రకృతి వైద్యులు బండి విజయ్ గార్లతో కలిసి మామిడి మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించారు.
సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్.
సన్న బియ్యం పథకం పక్కదారి పట్టకుండా చూడాలని సేవ్ కొత్తగూడెం సేవ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ కోరారు.సన్న బియ్యం బాగున్నాయి కానీ అన్ని రేషన్ షాపుల్లో ఇదే పద్ధతుల్లో ఉన్నాయో లేదో తెలియదు.సన్న బియ్యం పథకం అక్రమాలకు పాల్పడితే ఆ రేషన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలి.సన్న బియ్యం ముఖ్యమంత్రి మంత్రులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో తినాలి. తెలంగాణలో పండే సన్న వడ్లు వాటితో వచ్చే బియ్యంను పేదలకు పంపిణీ చేయాలి.
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్
కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా శనివారం నాడు మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్, ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు.భూతల్లికి తీరని లోటని ఆయన అన్నారు.పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణలో భావితరాలకు ఆస్తులుగా ఇచ్చిన […]
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచుతు తన ఇంటిపేరునే వనజీవి గా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈయన చేసిన కృషికి గుర్తింపుగా సామజిక సేవా విభాగంలో 2017 పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.