UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

అనుమానాస్పద స్థితిలో గురుకుల విద్యార్థి మృతి..!

జిల్లెలగడ్డ గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలోని ఘటన శోక సముద్రంలో మునిగిన తల్లితండ్రులు… హుస్నాబాద్: అక్టోబర్ 7 తెలంగాణ వాణి రూరల్ ప్రతినిది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం వివేక్ ఈనెల 6న తిరిగి పాఠశాలకు వచ్చాడు. మంగళవారం ఉదయం పాఠశాల భవనం రెండో అంతస్తు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ […]

మంత్రి అడ్లూరికి పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాదులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదని దళిత నాయకుడు శనిగారపు రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, మంగళవారం ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి అని చూడకుండా విలేకరుల ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం శోచనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా […]

బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్ గుప్తా

ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి హనిఫ్ పాషా) బీజేపీ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్త పేర్కొన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తనకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించడం తనకు ఒక గొప్ప అవకాశం అని, ఈ […]

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్.

కొత్తగూడెం సోమవారం సాయంత్రం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ బంక్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించారు. గాయపడిన ఖలీల్ పాషా ను తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించడంతో పాటు,వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానవత్వంతో స్పందించి సహాయం చేసిన ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను ఖలీల్ కుటుంబ సభ్యులు […]

రేపు ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) ఇచ్చోడ మండలం దాబా కె గ్రామంలోని అంబేద్కర్ భవన్ వద్ద అక్టోబర్ 7వ తారీకున మంగళవారం ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, తమ గురువు సత్యపాల్ మహారాజ్ హాజరవుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కావున పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని […]

స్థానికంలో విజయ డంకా మోగించాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయ డంకా ముగిస్తుందని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు తలుపులు బద్దలు కొడతామని ఎంపీపీ జడ్పిటిసి లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ […]

బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు..? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా..? అని అడిగింది. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నఈ పిటిషన్‌‌ని విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. అయితే, బీసీలకు 42 […]

వర్షం పడితే చెరువును తలపిస్తున్న సరస్వతి కాలనీ.. డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి

లక్ష్మీదేవి పల్లి మండలం సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హమాలీ కాలనీ,సరస్వతీ కాలనీ నందు చిన్న వానకే చెరువును తలపిస్తున్నా పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సైడ్ డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లన్నీ కప్పేస్తూ చెరువుల్లా మారుతోందనీ అంటున్నారు.విద్యార్థులు, పాదచారులు,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులను కాలనీవాసులు కోరుతున్నారు.

ఎన్నికల కోడ్ ప్రభావం… ప్రజావాణి నిపిలివేత!

సిరిసిల్ల కలెక్టర్ ఎం. హరిత కీలక నిర్ణయం రాజన్న సిరిసిల్ల జిల్లా,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి): సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హరిత ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల వినతులను స్వీకరించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేయబడుతుంది. అనంతరం యధావిధిగా పునరుద్ధరిస్తాం కలెక్టర్ […]

బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాక : మంత్రి లక్ష్మణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతి […]