బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% చట్టబద్ధ ప్రాతినిధ్యం కోసం బీసీ సంఘాలు పిలుపునిచ్చిన శనివారం బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, హైకోర్టులో కేసు గెలిచి తీరుతామని దీమా వ్యక్తం చేశారు. కావున రేపటి బందులో బోథ్, సోనాల, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులు, వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు కళాశాలలు, హోటల్లో యాజమాన్యాలు స్వచ్ఛందంగా బందులో పాల్గొనాలని తెలిపారు
Post Views: 193