UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు..? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా..? అని అడిగింది. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నఈ పిటిషన్‌‌ని విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో 9 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest