UPDATES  

NEWS

కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు 

 బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తెలిపారు. రేపటి బంధు లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ నాయకులు బొల్లి స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం లో వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు అమలు చేయవచ్చని రాసారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ బద్ద ప్రక్రియలో బీసీ లకు చట్ట బద్దంగా 42% రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేసిందని, ఎస్సీ, ఎస్టీ లు అందరం దీని అమలు కొరకు మద్దతుగా ఉన్నామని తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్ కొత్త నర్సింహులు మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ బద్దంగా చేసిన ప్రక్రియను గవర్నర్, రాష్ట్రపతి ల వద్ద బిల్లులను పెండింగ్ పెట్టుకుని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. బీసీ లందరు పార్టీలకతీతంగా రేపటి బంధుని విజయవంతం చేసి కేంద్రానికి మన బలం తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, నాయకులు పాలకుర్తి రాజేశం గౌడ్, సాగంటి కొండయ్య, వేల్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest