G.O.A.T: విజయ్ గోట్ మూవీలో ఎమ్మెస్ ధోని?!
తమిళ హీరో విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మీనాక్షీ శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, జయరామ్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, వైభవ్, యోగిబాబు, ప్రేమ్‌జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మైదానంలో షూటింగ్ చైన్నెలో ప్రారంభం అయిన ఈ […]
లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు..!
భారత ఫుట్బాలర్ బిజయ్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బా ల్లో బరిలోకి దిగ నున్న తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్కు చెందిన 22 ఏళ్ల బిజయ్ తొ ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ చెన్నైయన్ ఎఫ్సీ తరఫున ఆడుతున్న […]
క్రికెటర్లకు తగిన గౌరవం ఇవ్వాలి.. సోనూ సూద్
ఐపీఎల్ 2024లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే కారణమని ఆరోపణలు, విమర్శలు, ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించాడు. క్రికెటర్లకు తగిన గౌరవం ఇవ్వాలని సోనూ ట్వీట్ చేశాడు. గెలిచిన రోజు పొగిడి, ఓడిన రోజు తిట్టడం సరికాదని చెప్పాడు. ఫెయిల్ అయ్యేది ప్లేయర్స్ కాదని.. వాళ్ళను నిరుత్సాహపరిచేలా వ్యవహరంచే మనమే అని ఫ్యాన్స్‌కి హితబోధ చేశాడు. మన దేశం కోసం ఆడుతున్న ప్రతి ఒక్క […]
తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. గురువారం రాత్రి జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. 12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది డీసీ. సున్నా పాయింట్లతో టేబుల్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆదివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది డీసీ. బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో […]
రోహిత్ శర్మే అనుకున్నాం.. మలింగతో కూడా బయటపడ్డ విభేదాలు
ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా ఫ్యాన్సే ఆ జట్టును తిట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పటి జట్టులా అనిపించట్లేదు. కొత్త సారథి హార్థిక్ పాండ్యా జట్టులో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. అసలు ముంబై జట్టులో ఏం జరుగుతుంది..? వీళ్ల విభేదాలతో కనీసం ప్లే ఆఫ్ కు చేరేలా పరిస్థితి కనపడటం లేదు. ముంబై ఇండియన్స్ కు కొత్త కొప్టెన్ హార్థిక్ పాండ్యా వచ్చినప్పటి నుంచి జట్టులో […]
Sunil Narine: చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో..
చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు. అందరికంటే ఎక్కువగా కీరన్ పోలార్డ్ 660 […]
రోహిత్, హార్దిక్ పాండ్యాల పక్కన ఎవరా ముద్దుగుమ్మ?
ముంబయి ఇండియన్స్ క్రికెటర్ల పక్కన ఓ ముద్దుగుమ్మ ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ పక్కన ఓ అందాల భామ ఉన్న ఫోటో ఇటీవల బయటకొచ్చింది. అదే భామ హార్దిక పాండ్యా పక్కన కూడా ఉన్న మరో ఫోటో తాజాగా వైరలవుతోంది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి తేలిందేంటంటే- ఆ అమ్మడి పేరు సెజాల్ జైస్వాల్. ఆమె ఒక టీవీ నటి. దిల్ మాంగే […]
Hyderabad airport: ప్రపంచంలోని గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి.. శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024) కోసం భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన పీటర్సన్ తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు. శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు పీటర్సన్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలు మ్యాచ్‌ల కోసం భారత నగరాల్లో తిరుగుతున్నాడు (Hyderabad International Airport). బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై […]
USA Cricket Team: USA క్రికెట్ జట్టులో హైదరాబాద్ అమ్మాయికి చోటు..
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ఇమ్మడి సాన్వికి స్థానం లభించింది. యూఏఈలో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. కాగా.. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున సాన్వి అరంగేట్రం చేసింది. సాన్వి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె జాతీయ జట్టుకు ఆడబోతోంది. ఇమ్మడి సాన్వి కుటుంబం సికింద్రాబాద్ లోని సీతాఫల్ […]
అతను చాలా డేంజరస్ క్రికెటర్.. డగౌట్లో ఎందుకు కూర్చోబెట్టారు..?
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్ పృథ్వీ షా గురించి తెలియని వారుండరు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు. అలాంటిది.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతను మ్యాచ్ ల్లో కనపడటం లేదు. కేవలం డగౌట్ కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు రికీ భుయ్ కు అవకాశం కల్పించారు. గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి […]