బాలల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ దేవి పల్లి మండల ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్)ను శుక్రవారం నాడు వితరణ చేశారు. ఈ మేరకు ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సోమయ్య,పాఠశాల హెచ్ ఎం మరియు ఏటీఈసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.వి బి.రత్నాకర్, రాష్ట్ర కోశాధికారి భట్టు చందర్ కలిసి సెంటిమెంట్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.అదేవిధంగా బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్ మరియు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఐక్య తల్లిదండ్రుల సంఘ సభ్యులు యన్.సీతారాములు,బి.పద్మ, బి.అనూష తో పాటు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 214
