ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) కొత్తూరు గ్రామంలో నెరువట్ల పెద్ద లచ్చయ్య తండ్రి బాలరాజు కొద్ది రోజుల క్రితం మృతిచెందగా, వారి కుటుంబానికి పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ మామిడి స్వామిరెడ్డి అండగా నిలిచారు. మృతుడు లచ్చయ్యది పూర్తిగా నిరుపేద కుటుంబం కావడంతో కొత్తూరు మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి లింగయ్య గౌడ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మామిడి స్వామిరెడ్డిని కోరగా ఆయన వెంటనే స్పందించారు. లచ్చయ్య కుటుంబానికి స్వామిరెడ్డి తనవంతుగా 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పంపించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపెల్లి పోచయ్య, సీనియర్ నాయకులు నెరువట్ల మల్లయ్య, కత్తర్ల సది, నెరువట్ల చంద్రయ్య, రాజయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 225