చాతకొండ సర్పంచ్ అభ్యర్థిగా వజ్జా ఈశ్వరి
లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలం, చాతకొండ గ్రామానికి చెందిన వజ్జా ఈశ్వరి ఆశ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఉమ్మడి చాతకొండ పంచాయతీ మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసిన స్వర్గీయ మాజీ సర్పంచ్ వజ్జా సీతారాములు భార్య గా అందరికి సుపరిచితురాలైన వజ్జా ఈశ్వరి భర్త బాటలో ప్రజా సేవ చేసేందుకు పంచాయతీ బరిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తగా ఉంటూ ఎంతో మందికి సేవలందించానని, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆశీస్సులతో సిపిఐ పార్టీ బలపరిచిన తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు మరిన్ని సేవలందిస్తానని, గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడమే కాక అందరికి అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా ఆమె తెలిపారు.


