UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల శ్రీకాంత్ ల పై అనుమానం వచ్చి వారిని పట్టుకుని విచారించగా మేడారం టన్నెల్ లో కాపర్ వైర్ దొంగతనం చేసింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వీరిని నంది మేడారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు సతీష్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest