ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నంది మేడారం ఆధ్వర్యంలో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ హాజరు కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత, డాక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్, టిబి అలర్ట్ ఇంపాక్ట్ఇండియా పెద్దపెల్లి జిల్లా ఇంప్లిమెంటేషన్ లీడ్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీబి చాంపియన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీబీ చాంపియన్ వాణి టీబీ లక్షణాల గురించి, టిబి ఎలా సోకుతుంది,టీబీ త్వరగా గుర్తించడం గురించి,టిబి వ్యాధి చికిత్స, డిబిటి, పోషకాహార కిట్ల గురించి ప్రజలకు తెలిపారు.
వ్యాధి సోకే అవకాశం కలిగిన ఆరు రకాల ప్రజలను గుర్తించి వారికి అవసరమైన తెమడ పరీక్షలు,ఎక్స్రేలు, ఇతరత్రా పరీక్షలు నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చి దిద్దడానికై ప్రజలందరూ అవగాహనతో ముందుండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వేముల వసంత, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ దేవి జయ, హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి, ఏఎన్ఎం అరుంధతి, ఆశా కార్యకర్తలు మంజుల, మల్లీశ్వరి, లలిత, ప్రభుత్వ టీచర్ పిఎన్ఆర్ శర్మ, అంగన్వాడి టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు.



