UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వీరిద్దరికి నోటీసులు అందిస్తామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఆసుపత్రి, అల్లోపతి, హోమియో యునాని ,ఆయుర్వేద డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్యశాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు ఆమె వెంట ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest