ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ప్రత్యేకంగా హైదరాబాద్ పిలుచుకొని సన్మానించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం ఆదర్శ పాఠశాలలో సెప్టెంబర్ నెల 2024వ తేదీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నూతన ఆలోచనలతో విద్యార్థులకు అన్ని రకాల వసతులు తో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ నిత్యం కృషి చేస్తున్నారు. ప్రిన్సిపల్ గా 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో సాధించిన విజయాలతో సొంత ఊరిలో ఉన్న ధర్మారం ఆదర్శ పాఠశాలను సర్వతో ముఖాభివృద్ది దిశగా అడుగులు వేయిస్తూ, విద్యార్థులు సాధించిన విజయాలతో ప్రతినెల మంత్లీ మ్యాగజైన్ (మాసపత్రిక) విడుదల చేయడం జరుగుతుందని,విద్యార్థులలో సామాజిక క్రమశిక్షణ సేవా భావం ఏర్పాటు కోసం ఎస్ పి సి స్టూడెంట్ పోలీస్ క్యాడేట్ ఏర్పాటు చేయడం. విద్యార్థులు మధ్యాహ్న సమయాన్ని కూడా వదలకుండా వివిధ విషయాల పట్ల పూర్తి జ్ఞానాన్ని పొందడానికి పాఠశాలలో విద్యార్థుల తో నిర్వహించే రేడియో ఎఫ్ఎం 674.26 ఏర్పాటులో దిగ్విజయం సాధిస్తున్నామన్నారు. పాఠశాలలో వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులందరూ తినేలా విద్యార్థులతో కలిసి మీల్స్ విత్ స్టూడెంట్స్ అనే కార్యక్రమంతో విద్యార్థులతో కలిసి ప్రతిరోజు భోజనం చేయడం. పాఠశాలలో ప్లాస్టిక్ నియంత్రించేందుకు ప్లాస్టిక్ రహిత పాఠశాల కార్యక్రమాలు నిర్వహించడం. పాఠశాలలో విద్యార్థులు అందరూ సమాన అవకాశాలతో వివిధ క్రీడలలో పాల్గొనే విధంగా ప్లే ఫర్ ఆల్ కార్యక్రమం నిర్వహిస్తూ పాఠశాల క్రీడా విజయాలను మరింత ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ తో పలుమార్లు చర్చలు జరిపి పాఠశాలకు ఆనుకొని ఉన్న గుట్టలతో నిండిన స్థలాన్ని క్రీడామైదానంగా మార్చుటకు ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారి తల్లిదండ్రులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరు కావాలని సూచించారు. విద్యార్థి ఇంటికి ఉపాధ్యాయులు అని ఆదర్శ ఇంటి బాట కార్యక్రమం తో పలు గ్రామాలలో హోమ్ విజిట్ చేయడం జరుగుతుందన్నారు. ఇలా వివిధ రకాల వినూత్నమైన ఆలోచనతో కార్యక్రమాలతో పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ఈనెల 20న హైదరాబాదుకు ప్రత్యేకంగా పిలుచుకొని కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకుని అభినందించి శాలువాతో సత్కరించారని రాజ్ కుమార్ తెలిపారు. ఉన్నత అధికారుల నుండి ప్రశంసా పత్రం అందుకున్న ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.



