UPDATES  

NEWS

కృషి పట్టుదలే విజయానికి సోపానాలు అందెశ్రీ కి కొవ్వొత్తుల నివాళులు అర్పించిన నేతలు ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం.. ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్

 కృషి పట్టుదలే విజయానికి సోపానాలు

నిరుద్యోగుల పాలిట వరం ఈ జాబ్ మేళా

తెలివితేటలు ఎవరి సొత్తు కాదు

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నాం

త్వరలో మల్టీఫెక్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు

ఎమ్మెల్యే కూనంనేని

విజయవంతమైన జాబ్ మేళా

8500 మంది నిరుద్యోగులు హాజరు

సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు

 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కృషి, పట్టుదల, సమయ పాలనను పాటించి చదువులు సాగిస్తే విజయాలు వాటంతటవే వరిస్తాయని, నేటి యువత పెద్ద ఎత్తున చదువులపై శ్రద్ద పెట్టి భవిష్యత్ ను బంగారు మయంగా తీర్చుదిద్దుకోవాలని, ఇలాంటి జాబ్ మేళా లను సద్వినియోగం చేసుకోని ఉద్యోగాలు సాధించి ఆర్ధిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలని, ఈ జాబ్ మేళా నిరుద్యోగుల పాలిట వరమని కొత్తగూడెం శాసన సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన మెగాజాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. 71 కంపెనీలతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు సుమారు 8500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచిన వారికి అప్పటికప్పుడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలు జారీ చేయడంతో పాటు వివిధ కంపెనీలు 3వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. దీంతో నిరుద్యోగుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లు విరిశాయి. ముందుగా ఎమ్మెల్యే కూనంనేని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, నంగరేణి సంస్థ సి అండ్ ఎండి బలరామ్, సింగరేణి డైరెక్టర్ పా గౌతం పోట్రు, ఎస్పి రోహిత్ రాజ్ తో కలిసి జ్యోతి ప్రజల చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని ఎందరో నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్తగూడెం కేంద్రంగా జబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని, తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తుకాదని, పట్టుదలతో చదివి పైకి ఎదగాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగాల్లో ఉన్న అవకాశాలు చేజిక్కించుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. ఉద్యోగాలు రానివారు నిరుత్సాహానికి గురుకావద్దని, భగత్సంగ్, చేగవేరా, అంబేద్కర్, అబ్రహం లింకన్ వంటివారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. నేడు ఎంతో అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమంగా పెంచుకుంటూ, ఆంగ్లభాషపై పట్టుపెంచుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు వస్తుందని, అనుభవం ఎంతో గొప్పదని తెలిపారు. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠలాను నెమరు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ముందుకు సాగిన వారు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ చలించరన్నారు. పుట్టగానే ఎవ్వరూ గొప్పవారు కారని, పేదరికం నేర్పిన పాఠాలను మదిలో పెట్టుకుని ఎదిగేందుకు ప్రయత్నించిన వారే మేధావులని, ప్రస్తుతం మన మధ్యలో ఉన్న ఐఏఎస్. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐపిఎస్, ఎస్పి రాహుల్ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వారే అని, వారు నేడు నమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్నారని, అందుకు వారు చేసిన కృషే కారణం అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జరుగుతుందని, ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో జరిగిందన్నారు. శిథిలావస్తకు చేరిన బస్టాండ్ను పూర్తిగా తొలగించి రూ.16 కోట్లతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం రూపురేఖలు మార్చేందుకు మల్టిఫెక్సీతో పాటు షాపింగ్ కాంప్లెక్ నిర్మించనున్నామని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. అందే విధంగా పోస్టాఫీస్ సెంటర్ నుండి డబుల్ రోడ్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో రద్దీని తగ్గించేందుకు రూ.400 కోట్లతో బైపాస్ రోడు నిర్మించనున్నామని తెలిపారు. ఇప్పటికే ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందని, త్వరలో బటి హాబ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాల్వంచ కేటిపిఎస్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ కేంద్రాలను త్వరలో నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని, ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ద్వారా సర్వే కూడా చేసినట్లు చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటుకు తీవ్ర కృషి జరుగుతోందని, ఇందుకు కలెక్టర్ తోడ్పాటు మరువలేనిదన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో డయాలిస్ రోగుల సౌకర్యార్ధం 20 డయాలిస్ యంత్రాలను అందుబాటులోనికి తెచ్చామని, మౌళిక నదుపాయాల కల్పనతో పాటు ప్రజారోగ్యానికి కూడా పెద్దపీఠ వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటిలు నియోజకవర్గాభివృద్ధికి ఎంతగానే సహకరిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ పేదరికం గొప్ప వరమని, ఆ నేపధ్యం నుండివచ్చి నేను కష్టపడి చదువుకుని జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. చదువొక్కటే మనిషి జీవితాన్ని అందంగా మారుస్తుందని, ఆ చదువుని నమ్ముకున్న వారు ఎవ్వరూ చెడిపోలేదన్నారు. ఎస్పి రోహిత్ రాజ్ మాట్లాడుతు యువత జీవితాలు వారి నడవడికమీద ఆధారపడి ఉంటాయని, చదువుకునే రోజుల్లో చదువులపైనే శ్రద్ద పెట్టాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం డైరెక్టర్ పా గౌతం పోట్రు మాట్లాడుతూ యువత ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థానాల్లో నిలవాలని, సింగరేణి కార్మికులు సంస్థ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అనంతరం సిఎం అండ్ ఎండి బలరామ్ నాయక్ మాట్లాడుతూ తాము చుదువుకునే రోజుల్ల ఇన్ని సౌకర్యాలు లేవని, పట్టుదలలే పెట్టుబడిగా కష్టపడి చదివామని, ఇళ్లకు దూరంగా ఉంటూ కాలేకడువులతో పుస్తకాలతో కుస్తీపట్టామని అందుకే నేడు మీముందు సగర్వంగా నిలిచామని తెలిపారు. అనంతరం కారుణ్య నియామకాల్లో భాగంగా 374 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎక్సే సాబీర్ పాషా, సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం షాలేమ్ రాజు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ (ఏఐటియూసి) గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, సెంట్రల్ సెక్రెటరి వంగా వెంకట్, కార్పోరేట్ సెక్రెటరీ రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు, ప్రెసిడెంట్ త్యాగరాజన్, వైస్ ప్రెసిడెంట్ రంజాక్, పితాంబరం, ఏఐటియూసి నాయకులు వట్టికొండ మల్లిఖార్జున రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ, నలిగంటి శ్రీనివాస్, ఉప్పుశెట్టి రాహుల్, ఫయూమ్, భూక్య ధన్రు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest