మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందర ప్రధాన రహదారిపై మొక్కజొన్న రైతులు రోడ్డుపై బైఠాయించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమశాతం చూడడం లేదని మొక్కజొన్నలు తూకం కూడ ఆలస్యంగా చేపడుతున్నారని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారిని లావణ్య రోడ్డుపై బైఠాయించిన రైతుల వద్దకు వచ్చి తేమ శాతాన్ని పరిశీలించి 14 తేమశాతం వచ్చిన మొక్కజొన్నలు సీరియల్ ప్రకారము తూకం వేస్తారని అన్నారు. రైతులు మాత్రం 15 రోజుల కిందట తెచ్చిన మొక్కజొన్నలు కూడా కాంటలు పూర్తి చేస్తాలేరని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు హమాలీలను తెప్పించి మొక్కజొన్నలు తూకం వేయాలన్నారు.
Post Views: 90



