UPDATES  

 చుంచుపల్లిలో జననేత వనమా జన్మదిన వేడుకలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా చుంచుపల్లి మండలంలోనీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వనమా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత మాజీ మంత్రి వనమా కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మిడి రమాకాంత్, పెయింటర్ రాజేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, నవతన్, మాజీ ఉప సర్పంచలు దుర్గేష్, శ్రీహరి, నాయకులు రాజా, పోకల నగేష్, గోవిందు, శివ, కనుకుంట్ల రవి, బబ్లు, గడ్డం వెంకటేశ్వర్లు, పులి, మల్లయ్య, శంకర్, గోపి, జంపన్న, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest