UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తెలిపారు. రేపటి బంధు లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ నాయకులు బొల్లి స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం లో వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు అమలు చేయవచ్చని రాసారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ బద్ద ప్రక్రియలో బీసీ లకు చట్ట బద్దంగా 42% రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేసిందని, ఎస్సీ, ఎస్టీ లు అందరం దీని అమలు కొరకు మద్దతుగా ఉన్నామని తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్ కొత్త నర్సింహులు మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ బద్దంగా చేసిన ప్రక్రియను గవర్నర్, రాష్ట్రపతి ల వద్ద బిల్లులను పెండింగ్ పెట్టుకుని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. బీసీ లందరు పార్టీలకతీతంగా రేపటి బంధుని విజయవంతం చేసి కేంద్రానికి మన బలం తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, నాయకులు పాలకుర్తి రాజేశం గౌడ్, సాగంటి కొండయ్య, వేల్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest