లక్ష్మీదేవి పల్లి మండలం సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హమాలీ కాలనీ,సరస్వతీ కాలనీ నందు చిన్న వానకే చెరువును తలపిస్తున్నా పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సైడ్ డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లన్నీ కప్పేస్తూ చెరువుల్లా మారుతోందనీ అంటున్నారు.విద్యార్థులు, పాదచారులు,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులను కాలనీవాసులు కోరుతున్నారు.
Post Views: 174



