రేపు వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభం
నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)
జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. రేపు జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్స్ 7 బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర ఎమర్జెన్సీ వైద్య అవసరాల కొరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పూర్తిస్థాయి వైద్యం అత్యాధునిక వైద్య పరికరాలతో, అనుభవజ్ఞులైన వైద్యులతో సామాన్య ప్రజలకు కు అందుబాటులో వస్తున్నందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే జిల్లా కేంద్రం నుండి ఎంతోమంది హైదరాబాద్ వెళ్లి వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటుండగా ఇకపై దూర ప్రయాణం కూడా తప్పుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 22