UPDATES  

NEWS

 యశోదలో అరుదైన శస్త్ర చికిత్స

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు నమ్మశక్యం కాని అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కెఎస్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని యశోద హాస్పిటల్ కేర్ సెంటర్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కిరణ్ శాస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఫర్జానా బేగం అనే 52 సంవత్సరముల వయస్సుగల మహిళ తీవ్రమైన తలనొప్పి (పంటి భాగం, నుదురు, ముక్కు తదితర భాగాలు) ఇలా వచ్చినప్పుడు అసహజ లక్షణాలతో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ కు వచ్చింది. రమారమి నెలకు రెండు సార్లు తిమ్మిర్లు, చూపు మందగించడం, తెలియకుండా కిందపడిపోవడం జరిగేది. ఇంకా కొన్నిసార్లు ముఖాకృతి మారటం, ముక్కు, నాలుక, దవడ పరిమాణం పెరగడం, పళ్ళ అరమరికలో మార్పు, మింగటంలో ఇబ్బంది, ఇతరత్రా సమస్యలు, చేతులు, వేళ్ళు వాపులు వంటి అనూహ్యమైన వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగ తాము ఆమెకు ఎంఆఆర్ఐ బ్రెయిన్ (ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్) చేయించి పెద్ద పిట్యుటరీ ట్యూమర్ గుర్తించడం జరిగిందన్నారు. ఈ ట్యూమర్ ఉన్న గ్రోత్ హార్మోన్స్ సీక్రెషన్స్ వల్ల ఈ పై వ్యాధి లక్షణాలు కలిగాయి. నరానికి, నాడికి అతుక్కుని సంక్లిష్టంగా ఉన్న ఈ ట్యూమర్ను శస్త్ర చికిత్స సహాయంతో తొలగించాల్సి ఉంటుందని రోగి తరపు బంధువులకు వివరించామని, ముందుగా పేషంట్ కు కొన్ని రకాల ఉపశమనం మందులతో వైద్యం ప్రారంభించామన్నారు. అవి కూడా ఇతర స్పెషలిస్ట్ల సహాయంతో (ఇయన్.టి సర్జన్, ఎండోక్రైనాలజిస్ట్) పిపిఐ, కార్టిజోన్స్, యాంటియమటిక్స్ ఇతరత్రా బిపి మందులు ఇచ్చామన్నారు. ఈ శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్ ట్రాన్స్ ఎండోస్కోపిక్, ట్రాన్స్నాజల్ పద్ధతిలో దాదాపు పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. శస్త్ర చికిత్స అనంతరం మరల సిటి బ్రెయిన్ చేశామన్నారు. అందులో పూర్వపు లక్షణాలు, రక్తస్రావం, వాపు లాంటివి కనబడలేదని, న్యూరో హెచ్.డి.యు.లో ఒక రోజు ఉంచి, జనరల్ వార్డుకు మార్చడం జరిగిందన్నారు. అసాధారణమైన ట్యూమర్ తో తీవ్రంగా బాధపడుతున్న రోగికి శస్త్ర చికిత్స నిర్వహించి నమశక్యం కాని ఫలితాన్ని రాబట్టామన్నారు. సర్జరీ అనంతరం రోగిని స్థిరమైన స్థితిలో డిశార్జ్ చేశాము. తలనొప్పి మరియు సర్జరీకి ముందు ఉన్న సమస్యల నుండి దాదాపు ఉపశమనం లభించిందని, శస్త్ర చికిత్సను డాక్టర్లు కె.ఎస్.కిరణ్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్, విజయవంతంగా నిర్వహించారమన్నారు. విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest