ఇందిరమ్మ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్న ఎమ్మెల్యే
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
రెండు సార్లు జెడ్పిటీసీ, మాజీ జెడ్పి చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కూడ ఎటువంటి అధికారం దర్పం చూపడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. తన నియోజకవర్గ ప్రజలే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల ఉన్న ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఇంతకు ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.
అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కూడ ఎలాంటి డాబు దర్పం లేకుండా ప్రజల్లో కలిసిపోయే కోరం కనకయ్య లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రం చాతకొండ వెళ్లే దారిలో ఉన్న బడ్డీ కొట్టులో సాధారణ పౌరుడిలా టీ తాగారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కనే కారు ఆపించి టీ తాగుతు తమ ఇందిరమ్మ పాలనపై ప్రజల స్పందన అడిగి తెలుసుకుని వారితో సెల్ఫీ ఫోటోలు దిగారు. కాగా ఆ హోటల్ తో తనకున్న అనుబంధం ఈ నాటిది కాదని వీలునప్పుడల్లా శ్రీ రామ బేకరీ కి వచ్చి టీ తాగడం జరుగుతుందని ఆయన తెలిపారు. సాధారణ పౌరుడిలా రోడ్డు పక్కన టీ తాగడంతో కనకయ్యను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.