జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి)
దిగజారుడు రాజకీయాలకు ఆధ్యుడు హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అని, అలాంటి దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందంటూ తప్పుడు కూతలు కోస్తున్న కౌశిక్ రెడ్డి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాంపరింగ్ చేసే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ లు, లిక్కర్ స్కామ్ ల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి చెల్లుతుందని ఆకుతోట కుమారస్వామి తీవ్రంగా విమర్శించారు. గౌరవప్రదమైన శాసనసభ సభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని లేనియెడల హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.