UPDATES  

NEWS

ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు. పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్. ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్  తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

 నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు.

ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. ఇది శరీరానికి హాని చేస్తుంది అని తెలుపుతారు.

నిజంగానే ఈ మచ్చలు ఉన్న అరటి పండ్లను తినవద్దా? సహజ పోషకాలకు నిలువ అయిన అరటి పండ్లు త్వరగా అరుగుతాయి కూడా. అయితే ఎంత మాగితే అంత మచ్చలు పడతాయట ఈ పండ్ల మీద. అంతేకానీ ఇవి కుళ్లినవి, పనికి రానివి కావు అని తీసిపారేయకండి అంటున్నారు కొందరు. కేవలం ఎక్కువ మాగడం వల్ల మాత్రమే అరటిపండ్లపై మచ్చలు వస్తాయట. అవి హాని కలిగించేవి కావు.

అరటి పండ్ల మీద ఏర్పడే నల్లని మచ్చలు టీఎన్ఎఫ్ ఫ్యాక్టరీ ని సూచిస్తాయట. అంటే ట్యూమర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెబుతారు. ఇవి రక్తంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో తోడ్పడతాయి. అయితే బాగా మక్కిన అరటిపండ్లలో చాలా ఆక్సిడెంట్లు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయట. అంతేకాదు ఎన్నో రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కూడా అందిస్తాయట.

అరటి పండ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తూ పేగులను శుద్ది చేయడంలో కూడా సహాయం చేస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీసు, రాగి, బయోటిన్ వంటివి అరటిపండ్లలో పుష్కలంగా దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే అరటిపండును తినేసేయండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest