ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో తిథి భోజనాలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపతి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సులోచనల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఏడాది విద్యార్థులకు తిథి భోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం సంతోషం, సంతృప్తిని ఇస్తుందని విజయలక్ష్మి పేర్కొన్నారు.
నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం కు ఘన సన్మానం
చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మాలోత్ బలరాం ఎన్నికైన సందర్భంగా స్థానిక గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసి, రాబోయే రోజుల్లో నందా తండాను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.