పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్
లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ మాలోత్.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉంగటూరి అమృత రావు,ప్రభు భూషణం, వెంకట్రావు,జానయ్య, గుంటూరు రాంబాబు, ఏలియా,గడ్డం సురేష్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు
త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు
లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి దేవునికి మహిమ కలిగించేలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.శాంతి,ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాస్టర్ అమృత రావు కోరారు.ప్రజలందరూ ఏసు ప్రభు సూచించిన మార్గంలో నడవాలని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలు నాయక్, ప్రభు భూషణం,వెంకట్రావు, జానయ్య,రాంబాబు,ఏలియా,గడ్డం సురేష్,ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.