మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ పంచాయతీలోని బీసీ కాలనీలో ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ జానీ ఇంట్లో జరిగిన గ్యార్వి షరీఫ్ ఉత్సవాల్లో సిపిఐ నాయకురాలు, చాతకొండ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం అని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వి షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సర్వ […]
మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి

వీణవంక (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరపు మల్లయ్య (70) హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, ఆదివారం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంధి సమ్మిరెడీ, కర్ణకంటి శంకర్ రెడ్డి, మేకల వేణు తదితరులు పాల్గొన్నారు.