UPDATES  

ఎంపీ జీ నగేష్ జన్మదిన సందర్బంగా పండ్ల పంపిణీ

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు మరింత ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐక్యత సేవా సమితి బైంసా వారి సహకారంతో నిరుపేదలకు ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ కచ్చకాయల హరీష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

అక్రమ మొరం తరలిస్తున్న వాహనాల పట్టివేత

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రం సమీపంలోని మల్లాపూర్ మొగిలిపేట రహదారి సమీపానికి దగ్గర గల ప్రభుత్వ భూమి నుండి గత కొంతకాలంగా మొరము అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపై మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసిల్దార్ గుగ్గిళ్ళ రమేష్ గౌడ్ రెవెన్యూ సిబ్బంది రెండు జెసిబిలు, మొరము తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మల్లేశం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో గేలుపే లక్ష్యంగా పనిచేయాలని యాదవ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ ,యాదవ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంధినేని రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ ధర్మారం మండల ఉపాధ్యక్షులు జీల్ల కనుకన్న అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 24న ఉదయం10 లకు […]

గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు […]